కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇవ్వాల ముంబై టీమ్ తడబడుతోంది. బౌలింగ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ని కట్టడిచేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ముంబై జట్టు.. బ్యాటింగ్‌లో మాత్రం అంత పోరాట పటిమ చూపడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యాడు. రెండు పరుగులు మాత్రమే తీసి పెవిలియన్ చేరడంతో టీమ్ నిరాశకు గురైంది. ఆ తర్వాత తిలక్‌వర్మ, రమణ్‌దీప్ సింగ్, టిమ్ డేవిడ్ కూడా పెద్దగా స్కోరు చేయకుండానే ఔటయ్యారు. దీంతో ముంబై జట్టు 14.4 ఓవర్లకు 102 పరుగులు చేసి నాలుగు ఆరు వికెట్లు కోల్పోయింది.
కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. ఐదు వికెట్లు తీసుకున్న అతను.. ప్రమాదకరంగా మారుతున్న నితీష్ రాణా (43)తోపాటు రస్సెల్ (9)ను కూడా పెవిలియన్ చేర్చాడు. దీంతో తర్వాత వచ్చిన కోల్‌కతా బ్యాటర్లు ఎవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు వెంకటేశ్ అయ్యర్ (43), రహానే (25) మంచి ఆరంభం అందించారు. తర్వాత రాణా ధాటిగా ఆడినా.. శ్రేయాస్ అయ్యర్ (6), రస్సెల్, షెల్డాన్ జాక్సన్ (5), ప్యాట్ కమిన్స్ (0), సునీల్ నరైన్ (0), టిమ్ సౌథీ (0) ఎవరూ రాణించలేదు. చివర్లో రింకూ సింగ్ (23 నాటౌట్) కొంత పోరాడిని కోల్‌కతాకు భారీ స్కోరు అందించలేకపోయాడు.
ముంబై బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. కుమార్ కార్తికేయ 2 వికెట్లు తీసుకున్నాడు. మురుగన్ అశ్విన్, డానియల్ శామ్స్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా జట్టు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.