ఐపీఎల్ సీజన్ 2024కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐపీఎల్ మినీ వేలం ప్రక్రియ ముగిసింది. ఇక IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ హక్కులను టాటా గ్రూప్ కంపెనీ దక్కించుకుంది. అయిదేళ్ల వరకు టాటా గ్రూప్ భారత క్రికెట్ బోర్డుతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో 2028 వరకు టాటానే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. బీసీసీఐ(BCCI)తో టాటా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఐపీఎల్(IPL) సీజన్‌కు టాటా సంస్థ.. బీసీసీఐకి రూ.500 కోట్లు ముట్టజెప్పనుంది.
IPL 2024 మార్చి 23 నుంచి మే 29 వరకు జరగనున్నట్టు తెలుస్తొంది. దీనికి సంబంధించిన ఫుల్ షెడ్యూల్‌ను BCCI త్వరలోనే వెల్లడించునుంది. ఈ ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు.. 74 మ్యాచ్ లు ఆడనున్నాయి.