ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ మార్చి నెల అవార్డు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌కే దక్కింది. ఇటీవల భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన లిమిటెడ్ ఓవర్ సిరీస్‌ల్లో భువనేశ్వర్ 4.65 ఎకానమీతో ఆరు వికెట్లు(3 వన్డేల్లో), 6.38 ఎకానమీతో నాలుగు వికెట్లు(5 టీ20ల్లో) అదరగొట్టి ఈ పురస్కారానికి నామినేటయ్యాడు. భువనేశ్వర్‌తో రషీద్ ఖాన్(అఫ్ఘానిస్థాన్), సీన్ విలియమ్స్(జింబాబ్వే) పోటీపడినా.. తక్కువ ఎకానమీతో పరుగులిచ్చి వికెట్లు తీసిన భువీనే అవార్డు వరించింది. వికెట్ల పరంగా భువీ కాస్త వెనుకపడినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో పూర్తిగా సఫలమయ్యాడు. స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement