Tuesday, November 26, 2024

ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్ గా భవాని దేవి

భారత మహిళా ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్ లో అనేక ఏళ్లుగా పాల్గొంటున్న భారత్… ఇప్పటివరకు ఫెన్సింగ్ (కత్తి సాము) క్రీడాంశంలో మాత్రం అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు అయితే ఆ లోటును తీర్చనుంది  భవానీ దేవి. దీంతో ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన తొలి భారత ఫెన్సర్ గా రికార్డు పుటల్లోకెక్కింది. భవానీ దేవి తమిళనాడుకు చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి. ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొన్న భవానీ దేవి నిర్దేశిత ప్రమాణాలు అందుకోవడంతో టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు అయింది. ఆసియా ఓషియానియా జోన్ నుంచి ఒలింపిక్స్ కు రెండు బెర్తులు కేటాయించగా, ఒకటి జపాన్ ఫెన్సర్ కైవసం చేసుకోగా, రెండోది భవానీ దేవి పరమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement