సింగపూర్ ఓపెన్‌లో భారత టెన్నిస్ దిగ్గజం, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. శనివారంనాడిక్కడ జరిగిన సెమీ ఫైనల్‌లో వరల్డ్ నం.43 ర్యాంకర్ జపాన్ షట్లర్ సయేనా కవాకిమిని అద్భుత ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు… చిత్తు చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. భారత అరగంటకు పైగా కొనసాగిన మ్యాచ్‌లో 21-15, 21-7 తేడాతో సింధు జయకేతనం ఎగరవేసింది. మ్యాచ్ 32 నిముషాల్లోనే ముగియడం విశేషం. కవాకమిపై సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. స్మాష్ షాట్లతో సింధు విరుచుకుపడగా… కవాకమి పొరపాట్లు చేస్తూ ఓటమి పాలైంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ జోరు ముందు నిలవలేకపోయిన కవాకమి, కేవలం 32 నిమిషాల్లోనే చేతులు ఎత్తేసింది. దీంతో సింధు 2-0తో విజయం సాధించింది. సింగపూర్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం సింధుకు ఇదే తొలిసారి. 2022లో పీవీ సింధుకి ఇది మూడో ఫైనల్ మ్యాచ్. ఇంతకు ముందు ఈ ఏడాది ఫైనల్ చేరిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ, స్విస్ ఓపెన్ 2022 టోర్నీల్లో పీవీ సింధు విజేతగా నిలిచింది.
ఇదిలా ఉంటే, కెరీర్‌లో దాదాపు అన్ని సూపర్ 500 టైటిల్స్ సాధించిన డబుల్ ఒలింపిక్ మెడిలిస్ట్ సింధు, ఇప్పటిదాకా సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలవలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఆ లోటును పూడ్చుకోవాలని చూస్తోంది. ఈసారి ఎలాగైనా ఈ టైటిల్ గెలవాలని సింధు పట్టుదలగా ఉంది. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్‌లో రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు చైనాకు చెందిన హాన్ యూను చిత్తు చేసిన విషయం తెలిసిందే. సింగపూర్ ఓపెన్‌ను సొంతం చేసుకోవడానికి సింధు మరో అడుగు దూరంలో ఉంది. పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిస్తే, సైనా నెహ్వాల్ తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారత బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ ప్లేయర్‌గా నిలుస్తుంది. ఇంతకు ముందు 2010లో భారత దిగ్గజ షట్లర్ సైనా నెహ్వాల్ సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది. అలాగే సింగపూర్ ఓపెన్ తర్వాత తైపీ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ టీమ్ పాల్గొనబోతోంది. తైపీ ఓపెన్‌ను కరోనా కారణంగా గత రెండు సీజన్లలో నిర్వహించలేదు.
జులై 18 నుంచి తైపీ ఓపెన్
యోనెక్స్ తైపీ ఓపెన్‌గా పిలవబడే తైపీ ఓపెన్ జులై 19 నుంచి 24 వరకూ జరుగనుంది. ప్రస్తుతం సింగపూర్ ఓపెన్ కోసం స్విస్ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందం అక్కడి నుంచి తైవాన్ వెళ్లనుంది. తైపీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన ఏకైక భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా 2008లో సైనా నెహ్వాల్ రికార్డు క్రియేట్ చేసింది. పురుషుల బ్యాడ్మింటన్ ప్లేయర్లు కూడా ఎవరూ ఈ టైటిల్ గెలవలేకపోయారు. పీవీ సింధు సహా మిగిలిన ప్లేయర్లు ఎవరూ తైపీ ఓపెన్‌లో ఫైనల్ కూడా చేరలేకపోయారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.