Tuesday, November 19, 2024

Harbhajan Singh: అయోధ్య‌కు వెళ్లితీరుతాన‌న్న భ‌జ్జీ…. అదే బాట‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే

అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి వెళ్లితీరతానని టీమిండియా మాజీ క్రికెటర్‌, ఆప్‌ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ కుండబద్దలు కొట్టాడు. ఎవరు అవునన్నా.. కాదన్నా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు.

ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగాచూడాలని పార్టీలకు హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని విశ్వసిస్తానని.. ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని భజ్జీ పేర్కొన్నాడు.

కాగా జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలు.. తాము ఈవెంట్‌ను బాయ్‌కాట్‌ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. దీనిపై అప్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.. తాము కూడా రామ భ‌క్తులేమ‌ని, ఈ నెల 22 తర్వాత కుటుంబ స‌భ్యుల‌తో ఆయోధ్య రాముడిని ద‌ర్శించుకుంటామ‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు..

- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబాటు… రాజీనామా
గుజరాత్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీజే చావ్డా రామ మందిరంపై పార్టీ వైఖరికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు తన రాజీనామాను కూడా సమర్పించారు. చావ్డా రాజీనామాతో గుజరాత్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం కేవలం 15కు పడిపోయింది. మూడుసార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చావ్డా ఎన్నికల్లో బీజేపీ హవాను సైతం తట్టుకొని నిలబడ్డారు. రాజీనామా చేసిన సంద‌ర్భంగా ఆయోధ్య రామ మందిర ప్రారంభోత్స‌వాన్ని రాజ‌కీయాల‌కు త‌గ‌ద‌ని కాంగ్రెస్ అధిష్టానికి క్లాస్ పీకారు. తాను మాత్రం అయోధ్య వెళుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement