Tuesday, November 26, 2024

Beryl Storm : బార్బడోస్ లో చిక్కుకున్న టీమిండియా క్రికెటర్లు..

టీ20 వరల్డ్ కప్ గెలుపు జోష్ లో ఉన్న టీమిండియాకు తుఫాను కష్టాలు వచ్చిపడ్డాయి. ఫైనల్ మ్యాచ్ కు వేదిక అయిన బార్బడోస్ లోనే భారత జట్టు ఇరుక్కుపోయింది. అట్లాంటిక్ లో ఉద్భవించిన బెరిల్ తుఫాను కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అంతేకాకుండా, తుఫాను తీవ్రతరం అవ్వడంతో బార్బడోస్ ఎయిర్ పోర్టుని కూడా మూసివేశారు.

దీంతో టీమిండియా బార్బడోస్ లోనే ఉండిపోయింది. కాబట్టి బార్బడోస్ విమానాశ్రయం మూసివేయబడింది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. బయటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు తెలిపారు. తుఫాను తగ్గి.. పరిస్థితి సద్దుమణిగితే టీమిండియా స్వదేశానికి రానుంది.

బార్బడోస్ లో భారత బృందం హిల్టన్ లో బస చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా జులై 1 ఉదయం 11 గంటలకంతా భారత్ లో ల్యాండ్ కావాల్సి ఉండింది. భారత రూట్ మ్యాప్ బార్బడోస్ నుంచి న్యూయార్క్ కు.. న్యూయార్క్ నుంచి దుబాయ్ కు.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకునేలా ఉండింది. అయితే బెరిల్ తుఫాను టీమిండియా రిటర్న్ ప్లాన్ ను దెబ్బతీసింది. ఇదిలా ఉంటే, భారత ఆటగాళ్లు టీమిండియాకు రాగానే.. ఘనస్వాగతం పలకాలని ఎదురుచూస్తున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్ కప్ హీరోలకు ఘనంగా స్వాగతం పలకాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement