Saturday, November 23, 2024

IND-ENG Test | బౌలింగూ చేస్తానంటున్న స్టోక్స్‌..!

భార‌త్ ఇంగ్లండ్ జ‌ట్ల ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారగంగా ఈ నెల 15న మూడవ టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జరిగిన రెండు టెస్టుల్లో 1–1 విజయంతో సమానంగా ఉన్నాయి. రాజ్‌కోట్ వేదికగా జరగనున్న ఈ మూడవ టెస్ట్‌ మ్యాచ్‌ కోసం రెండు జట్లు సమాయత్తమవుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాయి. కాగా, రాజ్‌కోట్‌లో జరగనున్న టెస్టుతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మైలురాయిని చేరుకోనున్నాడు.

ఇప్పటి వరకు 99 రెడ్ బాల్ గేమ్‌లు ఆడిన స్టోక్స్ ఫిబ్రవరి 15న జరగనున్న మ్యాచ్‌తో 100వ టెస్టు ఆడనున్నాడు. ఈ సందర్భంగా నెట్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించిన స్టోక్స్ తన అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇటీవల, బెన్ స్టోక్స్ తన ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. తన 100వ టెస్ట్ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ చెమటోడుస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. మోకాలి సమస్య కారణంగా బౌలింగ్ చేయడం ఆపేసిన బెన్ స్టోక్స్‌ మళ్లీ బౌలింగ్ ప్రారంభించడంతో తన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గాయం కారణంగా తమ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ మిగిలిన టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో మరే ఇతర ఆటగాడిని ఎంపిక చేయబోమని ఈసీబీ తెలిపింది. అతని గైర్హాజరీలో యువ ఆటగాళ్లు టామ్ హర్ట్లీ, రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్ స్పిన్ భారాన్ని మోయనున్నారు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ బౌలింగ్ ప్రాక్టీస్‌లో కనిపించడంతో జట్టు బౌలింగ్ లైనప్‌లో తను కూడా చేరుతాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. స్టోక్స్ 146 ఇన్నింగ్స్‌లలో 197 టెస్ట్ వికెట్లు సాధించాడు, ఇందులో నాలుగు ఐదు వికెట్లు మరియు ఎనిమిది- నాలుగు వికెట్ల హాల్ ఉన్నాయి.

మోకాలి సమస్యతో బాద పడుతున్నాడు బెన్ స్టొక్స్. ఆ ప్రభావం 2023 ODI ప్రపంచ కప్ స్పష్టంగా కనిపించింది. తన మోకాలి సమస్య కారణంగా ఏర్పడిన అడ్డంకిని అంగీకరించిన స్టోక్స్.. తన ఆల్-రౌండర్ హోదాను తిరిగి పొందాలనే ఆశతో ప్రపంచ కప్ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. నవంబర్‌లో తన ఎడమ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు స్టోక్స్.

బెన్ స్టోక్స్ చాలాకాలంగా తన మోకాలి సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ ప్రభావం 2023 వన్డే ప్రపంచకప్‌లో స్పష్టంగా కనిపించింది. తన మోకాలి సమస్య కారణంగా ఏర్పడిన అడ్డంకిని గ్రహించిన స్టోక్స్, తన ఆల్ రౌండర్ హోదాను తిరిగి పొందాలనే ఆశతో ప్రపంచ కప్ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. నవంబర్‌లో స్టోక్స్ ఎడమ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది.

- Advertisement -

అయితే భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేయడం లేదని ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ ఇప్పటికే ప్రకటించారు. కానీ, బెన్ స్టోక్స్ పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ చురుగ్గా ఆడుతున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement