రాజస్తాన్ రాయల్స్ జట్టు ఆల్‌రౌండర్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్‌స్టోక్స్ గాయం కారణంగా ఐపీఎల్ మెత్తానికి దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ జట్టుకు దూరం కాగా, ఇప్పుడు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా స్టోక్స్ ఎడమ చేతి వేలికి గాయమైంది. స్కానింగ్‌లో స్టోక్స్ వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దాంతో అతను మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైనట్లు రాజస్తాన్ రాయల్స్ తెలిపింది. క్రిస్‌గేల్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి వేలికి గాయమైంది.అయితే, ఆ తర్వాత ఫీల్డింగ్, బౌలింగ్ కూడా చేశాడు. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చినప్పటికీ తొలి ఓవర్లోనే అవుటై పెవిలియన్ చేరాడు. నిన్న అతడి వేలికి స్కానింగ్ చేయగా అది విరిగినట్టు తేలింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్టు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తెలిపింది. మ్యాచ్‌లు ఆడకపోయినా ఇక్కడే ఉంటాడని, ఆటగాళ్లకు సలహాలు ఇస్తాడని పేర్కొంది.
ఐపీఎల్ నుంచి బెన్‌స్టోక్స్ అవుట్..
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement