ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డక్కెట్ చరిత్ర సృష్టించాడు. ఐదు టెస్టు సిరీస్‌లో రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. బజ్‌బాల్ బ్యాటింగ్‌తో 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ గడ్డపై అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి ఇంగ్లండ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా భారత్‌తో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన మూడో ప్లేయర్‌గా బెన్ డక్కెట్ నిలిచాడు. అతని కంటే ముందు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (84 బంతుల్లో) క్లైవ్ లాయడ్(85 బంతుల్లో) శతకాలను అందుకున్నారు.
సెంచరీ మార్క్ అందుకునే సమయానికి అతను 19 ఫోర్లతో పాటు ఓ సిక్స్ బాదాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఇంగ్లండ్ 35 ఓవర్లలో 2 వికెట్లకు 207 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ డక్కెట్ ( 133 నాటౌట్ ) జోరూట్ ( 9 నాటౌట్) ఉన్నారు.