Friday, November 22, 2024

BCCI కీల‌క నిర్ణ‌యం.. జ‌ట్టులోలేని ఆట‌గాళ్ల‌కు షాక్ !

భారత క్రికెటర్లకు బీసీసీఐ షాకిచ్చింది. ఆటగాళ్లందరూ తప్పనిసరిగా రంజీ ట్రోఫీ ఆడాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం జాతీయ జట్టులో భాగం ఆటగాళ్లు.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందుతున్న ఆటగాళ్లందరూ తదుపరి రౌండ్ రంజీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆటగాళ్లందరికీ తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాలని బీసీసీఐ మెయిల్స్ పంపినట్లు సమాచారం.

కొందరు క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్‌పై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఐపీఎల్ వేలానికి అర్హత సాధించేందుకు ఇలాంటి ఆటగాళ్లు కనీస సంఖ్యలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో పాల్గొనాలనే నిబంధనను అమలు చేయాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఇషాన్ కిషన్ తో పాటు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు కూడా రంజీల్లో ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement