Tuesday, November 26, 2024

BCCI | ఐపీఎల్‌కు ముందు చేతన్ సకారియాకు షాకిచ్చిన బీసీసీఐ..

టీమిండియా యువ బౌలర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ పేసర్ చేతన్ సకారియాకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. IPL 2024 వేలానికి ముందు సౌరాష్ట్ర బౌలర్ అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్ల జాబితాలో చేర్చింది. బీసీసీఐ సకారియాతో పాటు మరో ఆరుగురు బౌలర్ల పేర్లను కూడా అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చింది.

ఇదిలా ఉండగా, IPLకి సంబంధించిన ప్లేయర్ రిలీజ్ ప్రక్రియలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవల సకారియాను విడుదల చేసింది. 2024 ఐపీఎల్ వేలంలో మళ్లీ తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో సకారియా 50 బేస్ ప్రైస్ కేటగిరీలో 27వ నంబర్‌గా నమోదైంది.

- Advertisement -

BCCI అనుమానిత బౌలర్ల జాబితాలో సకారియా పేరు చేర్చడంతో.. అతనిని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవచ్చు. బీసీసీఐ చర్యతో చేతన్ సకారియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సకారియా తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రెండు టీ20లు మరియు ఒక వన్డేలో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ కలిగిన ఇతర బౌలర్ల వివరాలు..

తనుష్‌ కోటియన్‌ (ముంబై)
రోహన్‌ కున్నుమ్మల్‌ (కేరళ)
చిరాగ్‌ గాంధీ (గుజరాత్‌)
సల్మాన్‌ నిజార్‌ (కేరళ)
సౌరబ్‌ దూబే (విదర్భ)
అర్పిత్‌ గులేరియా (హిమాచల్‌ప్రదేశ్‌)
మనీశ్‌ పాండే (కర్ణాటక)
కేఎల్‌ శ్రీజిత్‌ (కర్ణాటక)

Advertisement

తాజా వార్తలు

Advertisement