Sunday, November 17, 2024

కోహ్లీపై ట్రోల్స్ కు స‌మాదానం ఇచ్చిన బీసీసీఐ..

భారతజట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకోనున్నాడనే వార్తల్లో నిజం లేదని బీసీసీఐ తెలిపింది. వన్డే సిరీస్‌నుంచి తనకు విశ్రాంతి కావాలని కోహ్లీ అధికారికంగా కోరలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, సెక్రటరీ జైషాకు సమాచారమివ్వలేదు. టెస్టు సిరీస్‌ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్‌కు దూరమైతే ఆ విషయాన్ని కోహ్లీ తెలియజేస్తాడని ఆయన మీడియాకు తెలిపారు. జనవరి 19 నుంచి సఫారీ జట్టుతో వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ ఆడతాడని బీసీసీఐ అధికారి తెలిపారు.

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత క్రికెటర్లు బయోబబుల్‌లో ఉండనున్నారు. శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. బయోబబుల్‌లో సుదీర్ఘకాలం ఉండేందుకు ఇష్టంలేకపోతే సెలక్షన్‌ కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలని ఆయన తెలిపారు. కాగా కోహ్లీ-విరుష్క దంపతుల తనయ వామిక తొలి పుట్టినరోజు వేడుకల కోసం కోహ్లీ వన్డే సిరీస్‌కు దూరమవనున్నాడని తొలుత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కోహ్లీని వన్డే ఫార్మాట్‌ నుంచి కెప్టెన్‌గా తప్పించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడనే ఊహాగానాలు వెలువడగా బీసీసీఐ కొట్టిపారేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement