ప్రభన్యూస్ : కివీస్ తో జరగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రహానె, వైస్ కెప్టెన్ పుజారా విఫలమయ్యారు. మరోవైపు అరంగేట్ర ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే సెంచరీ, హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈనేపథ్యంలో రహానె, నయావాల్ పుజారాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ సెకండ్ ఎడిషన్ ఇప్పటికే ప్రారంభమవడంతో వీరి స్థానాల్లో యువ క్రికెటర్లకు అవకాశమివ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ద్రవిడ్ యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడంలో ముందుంటాడు.
హెడ్ కోచ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ద్రవిడ్ వచ్చే ఏడాది ఆస్ర్టేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ తోపాటు, ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ను దృష్టిలో ఉంచుకుని వీరికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్ధం చేయనున్నాడు. కివీస్ తొ తొలిటెస్టులో కెప్టెన్ రహానె 26, 22 పరుగులు చేస్తే వైస్ కెప్టెన్ పుజారా 35, 4 పరుగులు చేసి విఫలమయ్యారు. ప్రస్తుతం పుజారా స్ట్రైక్ రేట్ ర 30.42 కాగా, మరోవైపు రహానె ఈ ఏడాది ఆడిన 21ఇన్నింగ్స్ల్ ల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. దీంతో వీరు తుదిజట్టులో ఎక్కువకాలం కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital