ముంబై: ఐపీఎల్-2022 టోర్నమెంట్ ముంగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లే ఆఫ్ బెర్తులు చేసుకోగా, మూడు, నాలుగు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టైమింగ్ మార్చినట్లు సమాచారం. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభంకావాల్సిన మ్యాచ్‌ను 8గం.లకు ఆరంభిం చాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల వెల్లడించాయి. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో మే 29న జరుగనుంది. ఐపీఎల్ ముగింపు వేడుకలను నిర్వహించే క్రమంలో మ్యాచ్ వేళలో ఈ మార్పు చేసినట్లు క్రిక్‌బజ్ కథనం వెల్లడించింది. ముగింపు వేడుకలలో భాగంగా సాయంత్రం 6.30గం.ల నుంచి 7.20గం.ల వరకు అంటే దాదాపు 50నిముషాల పాటు బాలీవుడ్ తారలతో కార్యక్రమాలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో 7.30గ.లకు టాస్ వేస్తే… 8గం.లకు మ్యాచ్ ఆరంభం కానుంది.
వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల టైమింగ్స్ మార్పునకు బీసీసీఐ శ్రీకారంచుట్టింది. ప్రస్తుతం రాత్రి 7.30గం.లకు ప్రారంభమవుతున్న మ్యాచ్‌లను వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో రాత్రి 8గం.లకు ప్రారంభించాల్సి ఉంటుందని బీసీసీఐ బ్రాడ్‌కాస్టింగ్ అధికారులకు తెలియజేసింది. మధ్యాహ్నం మ్యాచ్‌లు ఉంటే సాయంత్రం 4గంటలకు మ్యాచ్ ప్రారంభించాలని పేర్కొంది. 2023-27 వరకు ఐదేళ్లపాటు ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ మళ్లి బిడ్లు ఆహ్వినిస్తోంది. ఐదేళ్లపాటు ఐపీఎల్ ప్రసార హక్కుల ధర రూ.32,890 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..