ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి సమయం దగ్గరికొస్తోంది. దీంతో సాప్ట్ సిగ్నల్ నిబంధనపై బీసీసీపై ఓ ప్రకటన చేసింది. ఈ సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది. వివాదానికి కారణమవుతున్న ఆన్‌ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఐపీఎల్లో ఉండదని బోర్డు తెలిపింది. థర్డ్ అంపైర్‌కు నివేదించే ముందు ఆన్‌ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయంగా సాఫ్ట్ సిగ్నల్ ఇస్తారు. దీని ప్రభావం మూడో అంపైర్ నిర్ణయంపై కూడా ఉంటుంది. ఇక ఈ సీజన్‌కు కొత్తగా వచ్చిన నిబంధనల్లో కీలకమైనది 90 నిమిషాల్లోనే ఇన్నింగ్స్ 20వ ఓవర్ పూర్తి కావాలి. గతంలో 90వ నిమిషం లేదా ఆలోపు 20వ ఓవర్ ప్రారంభించే వీలు ఉండేది. కానీ మ్యాచ్ సమయం మరీ ఎక్కువ కాకుండా ఉండటానికి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక ఇన్నింగ్స్ కచ్చితంగా 90 నిమిషాల్లోనే (85 నిమిషాల ఆట + 5 నిమిషాల స్ట్రేటజిక్ టైమౌట్) ముగియాలి. ఆ లెక్కన గంటకు 14.11 ఓవర్లు వేయాలని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే దానికి తగిన జరిమాన విధించనుంది ఐపీఎల్ యాజమాన్యం.
Advertisement
తాజా వార్తలు
Advertisement