Wednesday, November 20, 2024

బీసీసీఐ సీఎంవో సాల్వీ రాజీనామా

బీసీసీఐ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అభిజిత్‌ సాల్వీ తన పదవికి రాజీనామా చేశాడు. కరోనా మహమ్మారి ఉద్ధృతమైన నేపథ్యంలో టీమిండియా మొత్తానికి ఆయన వైద్యపర్యవేక్షణ చేశారు. కొవిడ్‌-19 సమయంలో కీలకంగా వ్యవహరించిన సాల్వీ భారతజట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్ల వయసును నిర్ధారణ చేసే అధికారిగా, యాంటీ డోపింగ్‌ విభాగం హెడ్‌గా సేవలందించారు. 2011 నుంచి దశాబ్దకాలంపాటు బీసీసీఐలో వివిధ విభాగాల్లో సాల్వీ సేవలందించారు.

కాగా భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టు ముగిసిన సమయంలోనే సాల్వీ తన పదవికి రాజీనామా చేసినా బీసీసీఐ వెల్లడించలేదు. కాగా వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు సాల్వీ తెలిపారు. అండర్‌-16 బాయ్స్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌..విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ వచ్చే నెల జరగనుంది. దేశవాళీ క్రికెట్‌ టోర్నీలు సవ్యంగా జరగటంలో సాల్వీ కీలకపాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement