ఒలింపిక్స్ జావెలిన్ విభాగంలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.ఒలింపిక్స్ అథ్లెట్ విభాగంలో తొలి పతకం.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్ నీరజ్ చోప్రా. తాజాగా అతను టోక్యో ఒలింపిక్స్‌లో వాడిన జావెలిన్‌ను ఈ వేలంలో బిసిసిఐ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. నీరజ్ జావెలిన్‌ను దాదాపు రూ 1.5 కోట్ల బిడ్‌తో బీసీసీఐ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రా ప్రధాని మోదికి ఒక జావెలిన్‌ను అందజేశాడు. దీనితో పాటు మరికొందరు అథ్లెట్స్ కూడా తమ వస్తువులను ప్రధాని మోదీకి కానుకగా ఇచ్చారు.
- Advertisement -