ఆసియా కప్ టోర్నీలో కీలకమైన సూపర్-4 మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. ఓపెనర్లు పథుమ్ నిసాంక (40), దిముథ్ కరుణరత్నె (18) జట్టుకు శుభారంభాన్నందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 73 బంతులెదుర్కొని 6 ఫోర్లు ఒక సిక్సర్‌తో అర్థసెంచరీతో రాణించాడు.
సదీరా సమరవిక్రమ 72 బంతుల్లో 2 సిక్సులు, 8 ఫోర్లతో 93 పరుగులు చేయగా, అతడికి చరిత అసలంక(10), కెప్టెన్ దసన్ శనక(24) సహకారమందించడంతో 257 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగల్గింది. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మూద్, తస్కిన్ అహ్మద్ మూడేసి వికెట్లు పడగొట్టగా, షొరిఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 258 పరుగుల లక్ష్యఛేదనతో బంగ్లాదేశ్ బరిలోకి దిగింది.