టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయకేతనం ఎగరేసింది. నిర్ణీత ఓవర్లలో తొలుత 184 పరుగులు చేసిన టీమిండియా.. బంగ్లాదేశ్ జట్టుకు 185 పరుగుల టార్గెట్ పెట్టింది. అయితే.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభం అయిన 7 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో ఆటను 16 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
151 పరుగుల టార్గెట్‌ని బంగ్లదేశ్‌కు పెట్టగా.. అప్పటికే మెరుగైన ఆటతీరుతో మంచి రన్‌రేట్‌సాధించడంతో 54 బంతుల్లో 85 పరుగుల టార్గెట్ నిర్ధేశించారు. ఇక.. ఆ తర్వాత వరుసగా టీమిండియా ఆటగాళ్లు వికెట్ల మీద వికెట్లు పడగొడుతూ ఆటలో ఆధిక్యం ప్రదర్శించింది.. కాగా, కీలకమైన వికెట్లను బంగ్లాదేశ్ వెంట వెంటనే కోల్పోయిది. ఈ క్రమంలో అర్షదీప్‌సింగ్ 2, హార్దిక్ పాండ్య 2, సమీ 1 వికెట్ తీసుకున్నారు. మరొకటి రనౌట్‌గా ఉంది..