బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవల్లో రూబెల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, రూబెల్ మృతికి అధికార ప్రభుత్వమే కారణమని అతని తండ్రి రఫీకుల్ ఇస్లాం ఆరోపించారు.
ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా… మాజీ ప్రధాని షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అదే పార్టీకి చెందిన షకీబ్ అల్ హసన్ 28వ నిందితుడిగా ఉన్నాడు. అతనితోపాటు ప్రముఖ బంగ్లాదేశ్ నటుడు ఫెర్దూస్ అహ్మద్ 55వ నిందితుడిగా ఉన్నాడు.