అండర్- 19 వన్డే ప్రపంచకప్-2024లో డిఫెండింగ్ చాంపియ న్ భారత్ రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. 2022 చాంపియన్ యువ భారత్ నేడు (శనివారం) తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
16 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో భారత్ గ్రూప్-ఏలో ఉంది. ఒకొ క్క గ్రూప్‌లో చెరో నాలుగు జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఐర్లాం డ్, అమెరికా జట్లు ఉన్నాయి. తొలి మూడు స్థానల్లో నిలిచే జట్లు సూపర్-6కు అర్హత సాధిస్తాయి. వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ప్రపంచ యువ క్రికెటర్లు సత్త చాటుకునేందుకు రంగంలోకి దిగారు. రెండెళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్ సమరంలో ఇప్పటీవరకు భారత్ 5 సార్లు విశ్వ విజేతగా నిలిచింది. 2000, 2008, 2012, 2018, 2022లలో భారత్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది.
ఈ టోర్నీల్లో ఆడిన యువ క్రికెటర్లు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్నారు. ప్రస్తుత భారత జట్టులోని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, శుభ్‌మాన్ గిల్ కూడా అండర్-19 ప్రపంచకప్ ద్వారానే వెలుగులోకి వచ్చారు. మరోవైపు టీమిండియా మాజీ విధ్వంసకర హిట్టర్ యువరాజ్ సింగ్ కూడా (2000)లో అండర్-19 ప్రపంచకప్ ఆడాడు. వీరిందరూ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో తమదంటు ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు రాబోయే తరం నుంచి కూడా ఇలాంటి స్టార్ క్రికెటర్లు పుట్టుక రావాలని కోరుకుందాం. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియాపై ఈసారి అంచనాలు భారీగా పెరిగాయి. యువ భారత జట్టుకు ఉదయ్ సహరన్ న్యాయకత్వం వహిస్తున్నా డు.
ఇటీవల జరిగిన ఆసియ కప్‌లో భారత జట్టు సెమీస్‌లో ఓటమిపాలైంది. కానీ ఆ తర్వాత జరిగిన ముక్కోణపు సిరీస్‌లో మాత్రం భారత ఆటగాళ్లు మళ్లి సత్తాచాటుకున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి అరవెల్లి అవనీశ్, మురుగన్ అభిషేక్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభగాల్లో సత్తా చాటుకునేం దుకు భారత కుర్రాళ్లు రెడీ అయ్యారు.
భారత జట్టు (అంచనా): ఉదయ్ సహరన్ (కెప్టెన్), మురుగన్ అభిషేక్, అదర్ష్ సింగ్, అరవెల్లి అవనీష్ (వికెట్ కీపర్), సచిన్ ధాస్, ధనుష్ గౌడా, అర్షిన్ కులకర్ణీ, రాజ్ లింబానీ, ఇన్నెష్ మహజన్ (వికెట్ కీపర్), ప్రియాంషు మొలియా, ముషీర్ ఖాన్, సౌమి పాండే, రుద్ర పటేల్, ఆరాధ్య శుక్లా, నమన్ తివారి.