Tuesday, November 26, 2024

దీపా కర్మాకర్‌పై నిషేధం.. తనకు తెలియకుండానే నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకున్నానన్న అథ్లెట్‌

అథ్లెట్‌ దీపా కర్మాకర్‌ నిషేధిత మాదక ద్రవ్యాలు వినియోగించినట్టు శుక్రవారం నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె 21 నెలల పాటు సస్పెండ్‌ అయ్యింది. జులై 10, 2023 వరకు అమలులో ఉంటుందని అంతర్జాతీయ పరీక్షా సంస్థ ధృవీకరించింది. ఈ సంస్థ జరిపిన పరీక్షల్లో దీపా కర్మాకర్‌ పాజిటివ్‌ అని తేలింది. వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ ప్రకారం హిగనమైన్‌ నిషేధిత లిస్టులో ఉంది. ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ది జిమ్నాస్టిక్‌ సేకరించిన శ్యాంపిల్‌ పరీక్షలో దీపా కర్మాకర్‌ పాజిటివ్‌గా తేలింది.

తనకు తెలియకుండానే నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకున్నానని దీపా కర్మాకర్‌ అంగగీకరించారు. నిషేధం వల్ల 29 ఏళ్ళ దీపా చాలా టోర్నీలు మిస్‌ కానుంది. అపారటస్‌ ప్రపంచకప్‌ సిరీస్‌తో పాటు కనీసం మూడు ప్రపంచకప్‌ సిరీస్‌లకు కూడా దీప దూరం కానుంది. అయితే సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి అంట్‌వెర్ఫ్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement