Monday, November 25, 2024

Bajrang Punia | స్టార్ రెజ్ల‌ర్ బజరంగ్ పూనియాపై మరోసారి సస్పెన్షన్ వేటు

స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియాపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఒలింపిక్స్ పతక విజేత బజ్‌రంగ్‌ పూనియాపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నిషేధాన్ని విధిస్తూ నోటీసులు జారీ చేసింది. గత నెలలోనూ డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో బజ్‌రంగ్‌ను నాడా సస్పెండ్ చేసింది.

- Advertisement -

గత నెలలో కూడా డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో బజరంగ్‌ను నాడా సస్పెండ్ చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ‘నాడా డిసిప్లినరీ బాడీ’ (ఏడీడీపీ) ప్రకటించింది. గడువు ముగిసిన కిట్‌ల వాడకంపై తన ప్రశ్నలకు NADA స్పందించలేదని బజరంగ్ పునియా వివరించిన తర్వాత, ADDP తాత్కాలికంగా సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అయితే సస్పెన్షన్ ఎత్తివేసిన మూడు వారాల్లోనే, నాడా మరోసారి బజరంగ్‌ను సస్పెండ్ చేస్తూ ఛార్జి నోటీసులతో కొరడా ఝుళిపించింది.

అసలేం జరిగిదంటే..

మార్చి 10న సోనెపట్‌లో ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో బజ్‌రంగ్ సెమీఫైనల్లో ఓటమిపాలయ్యాడు. అనంతరం అతను డోపింగ్ పరీక్షకు శాంపిల్‌ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. ఈ విషయమై కన్నేర్ర చేసిన నాడా బజ్‌రంగ్‌పై తాత్కాలిక సస్పెన్షన్ వేటు విధించింది.

అయితే డోపింగ్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని బజ్‌రంగ్ పునియా ఏడీడీపీకి వివరణ ఇచ్చాడు. పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్‌లను వాడడంతోనే యూరిన్‌ శాంపిల్‌ ఇచ్చేందుకు నిరాకరించానంటూ తెలిపాడు. అసలు ఎక్స్‌పైరీ అయిన కిట్‌లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించానని, కానీ నాడా ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని ఏడీడీపీతో పేర్కొన్నాడు.

బజరంగ్ పునియా వివరణతో… నాడా తదుపరి నోటీసులు ఇచ్చేదాకా బజ్‌రంగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్టు తెలిపింది ఏడీడీపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బజ్‌రంగ్ పునియాకు నాడా ఛార్జ్ నోటీసులు పంపించిది. నిబంధనలు ఉల్లఘించాడంటూ సస్పెన్షన్‌ను తిరిగి విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement