Wednesday, November 20, 2024

Exclusive | బజరంగ్​, దీపక్​ షాకింగ్ నిర్ణయం​.. వరల్డ్​ రెజ్లింగ్ చాంప్​ పోటీలకు గుడ్​బై!

భారత స్టార్​ రెజ్లర్లు బజరంగ్​ పునియా, దీపక్​ షాకింగ్​ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే వరల్డ్​ రెజ్లింగ్​ చాంపియన్​షిప్​ పోటీల నుంచి తాము వైదొలుగుతున్నట్టు ఇవ్వాల (శనివారం) ప్రకటించారు. దీనికి గల కారణాలేంటనేది మాత్రం తెలియడం లేదు. ట్రైనింగ్​ విషయంలో స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా తమ డిమాండ్లకు అంగీకరించనందుకే ఇలా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రెజ్లర్లు బజరంగ్ పునియా, దీపక్ పునియా వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల నుండి వైదొలిగారు. ఇవ్వాల (శనివారం) వారు తీసుకున్న నిర్ణయాన్ని కొద్దిసేపటికి క్రితం వెల్లడించారు. కాగా, ఇది 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత ఈవెంట్. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో వినేష్ ఫోగట్.. సాక్షి మాలిక్‌తో పాటు బజరంగ్ కూడా పాల్గొన్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు, బెదరింపులకు గురిచేసినట్టు ఆరోపించారు.  

- Advertisement -

కాగా, ట్రయల్స్ లో పాల్గొనకుండానే బజరంగ్‌కు ఆసియా క్రీడల్లో నేరుగా ప్రవేశం కల్పించారు. అతను నాలుగు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలను కలిగి ఉన్నాడు. ఇక.. దీపక్ 86 కేజీల విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేతగా ఉన్నారు. బజరంగ్, దీపక్ విదేశాలలో శిక్షణ కోసం ప్రతిపాదనలు పంపించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల కోసం ఎంపిక ట్రయల్స్ షెడ్యూల్ వారి విదేశాలలో శిక్షణా శిబిరాల సమయంలోనే ఉంటుందని చెప్పారు.

ఇక.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్ ఆగస్టు 25-26 తేదీలలో NIS పాటియాలలో ఉండనున్నాయి. దీనిని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నియమించిన తాత్కాలిక కమిటీ నిర్వహిస్తుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు సెప్టెంబర్ 16-24 వరకు సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరగనున్నాయి. కాగా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి బజరంగ్, దీపక్‌లను కారణాలను అడిగినట్టు సమాచారం. ఇక.. ఆసియా క్రీడల కోసం కిర్గిస్థాన్‌లోని ఇస్సిక్-కుల్‌లో 39 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలన్న బజరంగ్ ప్రతిపాదనను ఆగస్టు 17వ తేదీన SAI అందుకుంది. దీపక్ రష్యాలోని ఖాసవ్యుర్ట్‌లో 35 రోజుల శిక్షణా శిబిరాన్ని కోరినట్టు సమాచారం అందుతోంది. వీటిని స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా నెరవేర్చలేని కారణంగా వారు ఆటలకు దూరం అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement