Saturday, November 23, 2024

జకోవిచ్​కు బ్యాడ్​ డేస్​.. వ్యాక్సిన్​ వేయించుకోలేదని ఆటనుంచి బహిష్కరించారు..

మెల్‌బోర్న్‌: ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, సెర్బియా సూపర్‌స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆస్ట్రేలియా దేశ బహిష్కరణపై న్యాయపోరాటంలో ఓడిపోయాడు. దీంతో నేటి నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడే అవకాశాన్ని జకో కోల్పోయాడు. కరోనా వ్యాక్సినేషన్‌ కారణంతో ఆస్ట్రేలియా ప్రభుతం జకోవిచ్‌ వీసాను రద్దు చేయగా న్యాయస్థానం ఆదివారం సమర్థించింది. దీంతో కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం పోరాడకుండానే ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి నిష్క్రమించాడు. మెల్‌బోర్న్‌ విమానాశ్రయం నుంచి సదేశానికి బయలుదేరి వెళ్లిపోయాడు. కాగా జకోవిచ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు నిరాకరించడనే కారణంతో ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన 34ఏళ్ల సెర్బియన్‌ వీసాను ఆస్ట్రేలియా ప్రభుతం శుక్రవారం రద్దు చేసింది. రెండోసారి వీసా రద్దు విషయంలో ప్రభుతాన్ని సవాల్‌ చేస్తూ జకోవిచ్‌ చేసిన అప్పీల్‌ను ఫెడరల్‌ కోర్టు కొట్టివేసింది.

న్యాయస్థానం జకోవిచ్‌కు ప్రతికూలంగా తీర్పునివ్వడంతో జకోవిచ్‌ ఆస్ట్రేలియా విడిచి వెళ్లిపోయాడు. వీసా రద్దుతో జకోవిచ్‌ మరో మూడేళ్లు వరకు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే అవకాశం ఉండదు. అంటే 2025వరకూ జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడే అవకాశం ఉండదు. దశాబ్దకాలంగా ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జకోవిచ్‌ కోర్టు నిర్ణయం వెలువడిన అనంతరం మాట్లాడుతూ ఇక ఆస్ట్రేలియాలో ఉండలేను..ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడలేను అని తెలిపాడు. తన కారణంగా టీకా వ్యతిరేక సెంటిమెంట్‌ బలపడుతుందని వీసా రద్దును సమర్థిస్తూ ఫెడరల్‌ కోర్టు ఇచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జకోవిచ్‌ తెలిపాడు. అందరూ తను ఇష్టపడే ఆట, తనకిష్టమైన టోర్నీపై దృష్టిపెట్టాలని ఆశిస్తున్నానని జకో పేర్కొన్నాడు. ఆదివారం రాత్రి మెల్‌బోర్న్‌లోని తుల్లామరైన్‌ ఎయిర్‌పోర్టులో స్వదేశం సెర్బియా వెళ్లేందుకు విమానం ఎక్కాడు.

ఈ ఘటన జరిగే కొన్ని గంటలముందు ఆస్ట్రేలియా ఫెడరల్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేమ్స్‌ ఆల్సోప్‌ మాట్లాడుతూ కొవిడ్‌ టీకా వేయించుకోని టెన్నిస్‌ సూపర్‌స్టార్‌ వీసా రద్దును పునరుద్ధరించడానికి, టెన్నిస్‌ క్రీడా చరిత్రలో కొత్తరికార్డు సృష్టించడానికి చేసే ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ అప్పీల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్‌ మంత్రి అలెక్స్‌ హాక్‌ పేర్కొన్న జకోవిచ్‌ వైఖరి టీకా సెంటిమెంట్‌ను ప్రేరేపించగలదని విషయాన్ని న్యాయస్థానం విశ్వసించింది. మరోవైపు ఫెడరల్‌ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఇమ్మిగ్రేషన్‌ మంత్రి హాక్‌ తెలిపారు. జకోవిచ్‌ను బహిష్కరించడాన్ని ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని అహేతుకం, అసమంజసం అని చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నం విఫలమైందని ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement