న్యూఢిల్లి : రాజస్థాన్ రాయల్స్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. దూకుడు మీదున్న ఈ జట్టుకు ఆల్ రౌండర్ నాథన్ కౌల్టర్ నీల్ దూరం కానున్నాడు. సిరీస్ మొత్తానికి నీల్ అందుబాటులో ఉండడని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్టు వివరించింది. దీనిపై ఓ వీడియోను తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ టిట్టర్‌పై పోస్టు చేసింది. స్పీడీ రికవరీ అనే క్యాప్షన్ కూడా జత చేసింది. రాజస్థాన్ తరఫున హైదరాబాద్‌పై కౌల్టర్ తొలి మ్యాచ్ ఆడాడు. మూడు ఓవర్లు వేశాడు. గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు.
డ్రెస్సింగ్ రూంకే పరిమితం అయ్యాడు. ఆ తరువాత ముంబై, బెంగళూరుతో ఆడిన మ్యాచుల్లో ఆడలేదు. కౌల్టర్ నీల్ స్థానాన్ని మరో ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ భర్తీ చేయనున్నాడు. గాయం నుంచి కోలుకుని… పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని తేలడంతో.. అతను సదేశానికి తిరుగుముఖం పట్టనున్నాడు. నీల్ స్థానంలో వచ్చిన సైనీ.. ముంబైతో ఆడి 3 ఓవర్స్‌లో 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బెంగళూరుపైన కూడా 3 ఓవర్లు వేసి.. 36 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ తీసుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..