లండన్ : హండ్రెడ్ లీగ్ 2022 మెగా క్రికెట్ టోర్నీకి రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ జాయింట్‌గా నిర్వహిస్తుంటుంది. 8 జట్లు ఇందులో పాల్గొంటాయి. అయితే ఈ టోర్నీలో అమ్ముడుపోని ఆటగాళ్లుగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు ఓపెనింగ్ పార్టనర్ మహ్మద్ రిజ్వాన్‌లు నిలిచారు. ఏ ఫ్రాంచైజీ కూడా ఇద్దరినీ తమ జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఆసీస్ సిరీస్‌లో బాబర్ అద్భుతంగ రాణించాడు. ఇద్దరు మేటి క్రికెటర్లు అమ్ముడుపోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరితో పాటు డేవిడ్ వార్నర్‌ను కూడా ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
ప్రస్తుతం వార్నర్ ఢిల్లి కేపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో బాబర్ ఆజమ్‌ను వేలం వేస్తే.. రూ.20కోట్లకు అమ్ముడు పోతాడని ఇటీవల పాక్ మాజీలు బహిరంగ ప్రకటన చేశారు. తాజాగా టోర్నీలో ఇద్దరినీ తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో.. ఆ మాజీలే.. నోరు మెదపకుండా మిన్నకుండిపోయారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..