”అజాదీ కా అమృత్ మహాత్సవ్” క్యాంపెయిన్‌లో భాగంగా ప్రపంచ మేటి క్రికెటర్లతో మ్యాచ్ ఆడిస్తే బాగుంటుందని పేర్కొంటూ బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదన పంపింది. స్వాతంత్య్ర దినోత్సవ 75వ వార్షికోత్సవ సంబురాల్లో భాగంగా టీమిండియాకి, వరల్డ్ ఎలెవన్‌కి మధ్య మ్యాచ్ నిర్వహించాలని పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లిd వేడుకల కోసం భారత ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుకి, మిగిలిన దేశాల ప్లేయర్లతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌కి మధ్య ఓ స్పెషల్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి బీసీసీఐకి ప్రతిపాదన వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ”కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియా ఎలెవన్‌కీ, వరల్డ్ ఎలెవన్‌కీ మధ్య ఆగస్టు 22న క్రికెట్ మ్యాచ్ నిర్వహించాల్సిందిగా ప్రతిపాదన వచ్చింది. వరల్డ్ ఎలెవన్ టీమ్ కోసం 13 నుంచి 14 మంది ప్లేయర్లు కావాలి. ఆ సమయంలో వివిధ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండడంతో ఎంత మంది ప్లేయర్లు అందుబాటులో ఉంటారో చూడాలి” అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియజేశాడు. ఆగస్టు 15న నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా చర్చిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్, వన్డే సిరీస్ అనంతరం వెస్టిండీస్ టూర్‌కు పయనం కానుంది. వరల్డ్ ఎలెవన్ వర్సెస్ టీమిండియా ఎలెవన్ మ్యాచ్ నిర్వహించాలని ప్రతిపాదన వచ్చిన ఆగస్టు 22న వెస్టిండీస్‌తో టీమిండియా మొదటి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు దూరంగా ఉంటున్నారు. ఒక వేళ ఇండియాలో ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంటే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లీ, బుమ్రా, రోహిత్ అండ్ కో స్వదేశానికి రావాల్సి ఉంటుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడే టీమిండియా జులై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ అండ్ కో పాల్గొనబోతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.