మహిళల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఆసీస్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. 83 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి భారీ విజయాన్ని అందుకుంది.
ఓపెనర్ బేత్ మూనీ (15) త్వరగానే ఔవుటైనా.. ఆ తర్వాత మరో ఓపెనర్.. కెప్టెన్ అలీసా హీలీ (37; 23 బంతుల్లో 5 ఫోర్లు), ఎలిసా పెరీ (22 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించారు. అయితే అలీసా గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరుగగా.. ఆష్లే గార్డ్‌నర్ (7 నాటౌట్)తో కలిసి ఎలిసా పెరీ ఆసీస్ విజయాన్ని పరిపూర్ణం చేసింది. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్‌కు ఒక వికెట్ దక్కింది.
ఇక అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌కు ఆసీస్ బౌలర్లు హడలెత్తించారు. వీరి ధాటికి పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. ఆష్లే గార్డ్‌నర్ (4/21), అన్నాబెల్ సదర్లాండ్ (2/15), జార్జియా వేర్హామ్ (2/16) విజృంభించి బౌలింగ్ చేశారు. పాక్ బ్యాటర్లలో ఆలియా రియాజ్ (26; 32 బంతుల్లో 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.