ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ నుంచి పురుషుల, మహిళల డబుల్స్‌లో రోహన్ బోపన్నతో పాటు సానియా మిర్జా జోడీ వైదొలిగింది. తొలి రౌండ్లోనే వీరిద్దరూ ఓటమి చవిచూశారు. రోహన్ బోపన్న, ఫ్రెంచ్ ఆటగాడు ఎడౌర్డ్ రోజర్-వెస్సెలిన్ జోడీ వరుసగా మూడు సెట్స్‌లో ఓడిపోయింది. వైల్డ్ కార్డ్ జోడీ క్రిస్టోఫర్ రుంగ్కట్, ట్రీట్ హ్యూయ్ జోడీ.. బోపన్న ద్వయంపై 6-3, 6-7(3), 2-6 పాయింట్ల తేడాతో ఓడిపోయారు.
గంట 48 నిమిషాల పాటు మ్యాచ్ కొనసాగింది. డబుల్స్‌లో ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచ్నోక్‌తో జోడీ కట్టిన సానియాకు చుక్కెదురైంది. తొలి రౌండ్లోనే స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్సెక్-కాజా జువాన్ జోడీ 4-6, 6-7 (5) చేతిలో సానియా జోడీ ఓటమిపాలైంది. 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గట్టిగానే పోటీ ఇచ్చినా.. ఓటమి తప్పలేదు. అయితే మిక్స్ డబుల్స్ విభాగంలో బోపన్న, సానియా మీర్జాల జోడీలు ఇంకా టోర్నీలో సజీవంగానే ఉన్నాయి.