ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో సింగిల్స్‌తో పాటు మిక్స్డ్ డబుల్స్‌లోనూ మన షట్లర్లు ఓటమిపాలయ్యారు.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ 19-21, 13-21 తేడాతో రెండో సీడ్ జపాన్ షట్లర్ కొడాయ్ నారౌక చేతిలో ఓడిపోయాడు. మరో సింగిల్స్ మ్యాచ్‌లో సమీర్ వర్మ 12-21, 13-21 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లిన్ చున్ యీ చేతిలో వరుస గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలుగమ్మాయి ఆకర్షి కశ్యప్ కూడా 17-21, 12-21 పాయింట్ల తేడాతో యు పొ (చైనీస్ తైపీ) షట్లర్ చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ పోరులో 8వ సీడ్ భారత జంట సుమిత్ రెడ్డి-సిక్కి రెడ్డి 12-14, 14-21 తేడాతో టాప్ సీడ్ జియాంగ్ చెన్ బాంగ్-వీ యా జీన్ (చైనా) జోడీపై ఓడి టోర్నీ నుంచి వైదొలిగారు.