Friday, January 24, 2025

Australian Grand Slam | ఫైనల్లో జ్వెరెవ్‌-సిన్నర్‌

  • గాయంతో జకోవిచ్ వాకౌట్

కెరీర్ లో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అడుగుపెట్టిన సెర్బియా దిగ్గజం, ఒలింపిక్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ ను దురదృష్టం వెంటాదింది. మరోసారి గాయం ఇబ్బంది పెట్టింది. దీంతో శుక్రవారం అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో జకోవిచ్‌ తొలి సెట్‌ అనంతరం వాకోవర్‌ ఇచ్చేశాడు. దీంతో ప్రపంచ రెండో ర్యాంకర్ జ్వెరెవ్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు.

- Advertisement -

టాప్‌ సీడ్‌ అలవోకగా..

మరో సెమీస్‌లో టాప్‌ సీడెడ్‌ జన్నిక్‌ సిన్నర్‌ అలవోకగా విజయం సాధించి వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో ప్రపంచ నెం.1 సిన్నర్‌ (ఇటలీ) 7-6 (7-2), 6-2, 6-2 తేడాతో అమెరికాకు చెందిన 21వ సీడ్‌ బెన్‌ షెల్టన్‌ను వరుస సెట్లలో చిత్తు చేసి దర్జాగా ఫైనల్లోకి అడుగు పెట్టాడు.

ఇక ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో రెండో సీడ్‌ జ్వెరెవ్‌తో వరల్డ్‌ నెం.1 సిన్నర్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా, రేపు (శనివారం) మహిళల విభాగం సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ పోరులో డిఫెండింగ్ చాంపియన్.. ప్రపంచ నం.1 అరీనా సబలెంకా – 19వ సీడ్ అమెరికా స్టార్ మాడిసన్ కీస్ టైటిల్ కోసం పోరాడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement