Friday, November 22, 2024

టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాటింగ్‌..

2022 ఐసీసీ టీ 20 వరల్డ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ – ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటాయని అయితే ఆస్ట్రేలియా టీమ్‌ భారత్‌పై విజయం సాధిస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీపాంటింగ్‌ అభిప్రాయ పడ్డారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్‌ ఫ్రెంచ్‌ టీమ్‌ రోహిత్‌ శర్మ టీమ్‌ను గెలిచి ట్రోపీని కైవసం చేసుకుంటుందన్నారు. టీ 20 మ్యాచ్‌ల ఆట తీరుపై రికీపాంటింగ్‌ దృష్టి పెట్టాడు. మాజీ కెప్టెన్‌ జస్టిన్‌ లాంగర్‌ కొద్ది రోజులు ఆస్ట్రేలియా టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించి ముందుకు నడిపించినప్పటికీ ప్రస్తుతం జస్టిన్‌ ఐపీఎల్‌ ప్రారంభమైన గత 5 సంవత్సరాలుగా ఢిల్లి క్యాపిటల్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడని తెలిపారు.

ప్రపంచం క్రికెట్‌ టీమ్‌లను దగ్గరుండి చూసిన రికీ పాటింగ్‌.. మిగతా క్రికెట్‌ ప్లేయర్ల ఆటతీరును కూడా విశ్లేషించిన అనుభవం ఉంది. పాటింగ్‌ కెప్టెన్సీలో రెండు సార్లు ఐసీసీ ప్రపంచ కప్‌ను కూడా సాధించిన చరిత్ర ఉంది. కేవలం సాధనమాత్రమే కాదు కొన్నిసార్లు అదృష్టం కూడా వరించాలన్నాడు. సుదీర్ఘకాలం క్రికెట్‌కు సేవలందించిన తాను అప్పటిలాగానే ఇప్పటికీ టీమ్‌ దృఢంగానే ఉందని చెప్పాడు. చివరగా టీ20 వరల్డ్‌ కప్‌లో టీమ్‌లు ఎన్నయినా ఫైనల్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మాత్రమే తలపడతాయని.. అదికూడా భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని రికీపాంటింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement