ఆస్ట్రేలియా 24ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై తొలిసారి పూర్తిస్థాయి సిరీస్ ఆడనుంది. మార్చిలో పాకిస్థాన్-ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కానుంది. పాక్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా 3టెస్టులు, 3వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. గతేడాది నవంబర్లోనే పాక్-ఆసీస్ మధ్య సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా భద్రత కారణాల రీత్యా ఆసీస్ తమ పర్యటన వాయిదా వేసుకుంది. కాగా చివరిసారి మార్క్‌టేలర్ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు 1998లో పాక్‌లో పర్యటించింది. అనంతరం కంగారూలు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు మార్చి 4నుంచి 8వరకు రావల్పిండి వేదికగా జరగనుంది. అనంతరం రెండో టెస్టు కరాచీ వేదికగా మార్చి 12నుంచి 16వరకు, మూడో టెస్టు లాహోర్ వేదికగా మార్చి 21 నుంచి 25వరకు జరగనుంది. టెస్టు సిరీస్ అనంతరం మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
మార్చి 29 నుంచి జరిగే వన్డే సిరీస్‌తోపాటు ఏకైర టీ20కు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 29న తొలి వన్డే, మార్చి 31న రెండో వన్డే, ఏప్రిల్ 2న మూడో వన్డే రావల్పిండిలోనే జరగనున్నాయి. చివరగా ఏప్రిల్ 5న జరిగే టీ20 మ్యాచ్‌తో ఆసీస్ పాక్ పర్యటన ముగుస్తుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక ఐదుటెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0తో గెలుచుకుని మంచి ఫామ్‌లో ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,