Sunday, November 10, 2024

Australia Vs India – రేపే ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఫైనల్ సంగ్రామం…

లండన్‌: ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక మహా సమరానికి ముహూర్తం దగ్గరపడింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యుటిసి ఫైనల్‌ కోసం దిగ్గజ జట్లు భారత్‌, ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. గత సీజన్‌ లో ఫైనల్‌లో చతికిలబడిన టీమ్‌ఇండియా ఈ సారి టైటిల్‌ గెలిచితీరాలనే పట్టుదలతో ఉంది. ఈ పోరు కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. ద్వైపాక్షిక సిరీసుల్లో దుమ్మురేపుతున్న టీమిండి యాకు ఐసీసీ టోర్నీల్లో మాత్రం అదృష్టం కలిసిరావ ట్లేదు. చివరిసారిగా ధోనీ కెప్టెన్సీలో జూన్‌ 23, 2013న ఛాంపియన్స్‌ ట్రోఫీని అందుకుంది. అప్పటి నుంచి ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఆ లోటును భర్తీచేసుకునే అవకాశం డబ్య్టుటీసీ ఫైనల్స్‌ రూపంలో మళ్లిd ఇప్పుడొచ్చింది. కాగా, మ్యాచ్‌పై మాజీ దిగ్గజాల అంచనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా వాతావరణానికి దగ్గరగా ఉండే ఇంగ్లండ్‌ పరిస్థితులు భారత్‌కు కూడా అనుకూలమని విశ్లేషిస్తు న్నారు. పేస్‌తోపాటు స్పిన్‌కు పిచ్‌ అనుకూలిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఇరు జట్ల సారథులకు సవాల్‌గా మారనుంది. సాంకేతికంగా ఒకటే టెస్టు అయినప్పటికీ, ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లలో ఒకటని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాం టింగ్‌ వ్యాఖ్యానిం చాడు. గత రెండేళ్లుగా ఆసీస్‌, భారత జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. ఇదే జోరును ఎవరైతే కొన సాగిస్తారో వారే విజేతగా నిలుస్తారు అని పేర్కొన్నాడు.

టీమ్ ఇండియా బౌలింగ్ ..
భారత జట్టుకు ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అందుబా టులో లేనప్పటికీ, వారి బౌలింగ్‌ అస్త్రాలు పదునుగానే ఉన్నాయని ఆస్ట్రేలియా వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ అభిప్రాయ పడ్డాడు. వారికి మిక్స్‌డ్‌ క్వాలిటీ పేసర్లున్నారు. షమి, సిరాజ్‌ కీలక బౌలర్లు. డ్యూక్స్‌ బంతులతో మేజిక్‌ చేయ గలరు. అలాగే పరిస్థితులకు తగ్గట్లు రాణించే స్పిన్న ర్లున్నారు. వారినుంచి మాకు కచ్చితంగా గట్టి సవాల్‌ ఎదురవుతుంది అని మీడియా సమావేశంలో స్మిత్‌ చెప్పారు. అలాగే, హేజిల్‌వుడ్‌ స్థానంలో నేసర్‌ని తుది జట్టులోకి తీసుకోవడాన్ని సమ ర్ధించుకున్నాడు. అతను బంతితోపాటు బ్యాట్‌తోనూ చెలరేగ గలడని చెప్పుకొచ్చాడు.

ఫేవరేట్ ఎవ‌ర‌న్న‌ది అప్ర‌స్తుతం…
మేము ఎలాంటి ఒత్తిడి ఫీలవడం లేదు. ఐసీసీ ట్రోఫీ గెలవాలన్నది లక్ష్యమే. గెలిస్తే ఆనందమే అని టీమిం డియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయ పడ్డారు. . అలాగని ఒత్తిడిలో మాత్రం లేము. రెండేళ్లుగా మెరుగైన క్రికెట్‌ ఆడుతున్నాం. ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచాం. ఇంగ్లండ్‌ లో సిరీస్‌ సమయం చేశాం. బలమైన ప్రత్యర్థిగా ఎదిగాం. ఐదారేళ్లుగా ప్రపంచ మంతటా సిరీస్‌లు ఆడుతున్నాం. ఐనప్పటికీ, ఐసీసీ ట్రోఫీ గెలవక పోవడం లోటే. కిందటిసారి ఆ అవకాశం చేజారింది. ఇప్పుడు మరొకసారి చాన్స్‌ వచ్చింది. ఫేవరెట్‌ ఎవరన్నది అప్రస్తుతం. రాబోయే ఐదు రోజులు ఎవరు బాగా ఆడితే వారినే విజయం వరిస్తుంది. రెండు జట్లు బలమైనవే. ఇరువైపులా మంచి ఆటగాళ్లున్నారు. భారీస్కోర్లు చేసి, 20 వికెట్లు తీయగలిగే జట్టుకే ఐసీసీ ట్రోఫీ లభిస్తుంది. టీమిండియా ఈ లక్ష్యాన్ని పూర్తిచేస్తుందన్న నమ్మకం నాకుంది అని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement