Saturday, November 23, 2024

ఆస్ట్రేలియా- శ్రీలంక టెస్టు సిరీస్‌.. లంక పట్టు, ఆసీస్‌పై 67పరుగులు ఆధిక్యం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు పట్టుబిగించింది. భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు 6 వికెట్లు కోల్పోయి 431 పరుగులు చేసి 67 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. 184/2 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక ఆదిలోనే కుషాల్‌ మెండిస్‌ (85) వికెట్‌ను జారవిడుచుకుంది. ఏంజిలో మాథ్యూస్‌, దినేష్‌ చండీమల్‌తో కలిసి జట్టు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలోనే మాథ్యూస్‌ అర్ధసెంచరీ పూర్తి చేసి, పెవిలియన్‌ చేరాడు. కమిండు మెండిస్‌తో కలిసి దినేష్‌ చండిమల్‌ ప్రత్యర్థి ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. కమిండు మెండిస్‌ 61పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద స్వీప్సన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ వద్ద వెనుదిరిగాడు.

అయితే చండిమల్‌ ఒంటరి పోరాటం చేస్తూ నిలదొక్కుకున్నాడు. 195 బంతుల్లో 1 సిక్స్‌, 8 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 431 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై 67 పరుగుల ఆదిక్యం సాధిచింది. దినేష్‌ చండిమల్‌ 118, రమేష్‌ మెండిస్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లియాన్‌, మిచెల్‌ స్వీప్సన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement