నిర్ణయాత్మక మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్లు కోల్పోయి కాస్త తడబడ్డట్టు కనిపించినా.. బ్యాట్స్‌మన్ నిలదొక్కకుని స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. సీనియర్లు స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ వెంటవెంటనే అవుటైనా ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు టిమ్ డేవిడ్ (54) డేనియల్ శామ్స్ 28 శతవిధాల ప్రయత్నించారు. ఈ క్రమంలో డేనియల్ 19వ ఓవర్లో అవుటయ్యాడు. కాగా, నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇండియా 187 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగాల్సి ఉంది..
ఇక.. అంతకుముందు ఇంగ్లిస్ అవుటవడంతో మాథ్యూ వేడ్ క్రీజులోకి వచ్చాడు. తొలి రెండు మ్యాచుల్లో ధాటిగా ఆడిన అతను ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆదుకుంటాడని భావించగా.. అక్షర్ అతన్ని డకౌట్ చేశాడు. అక్షర్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన వేడ్.. బంతిని సరిగా జడ్జ్ చేయలేకపోయాడు. దీంతో బంతి నేరుగా అక్షర్ వైపు వచ్చింది. వెంటనే రియాక్ట్ అయిన అతను ముందుకు దూకి మరీ క్యాచ్ పట్టేయడంతో వేడ్ (1) నిరాశగా పెవిలియన్ చేరాడు.