Wednesday, November 20, 2024

Australia – అన్ని క్రికెట్ ఫార్మెట్ లకు డేవిడ్ వార్నర్ గుడ్ బై…

ప్రముఖ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన వార్నర్‌.. తాజాగా టీ20ల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. పొట్టి ప్రపంచకప్‌ టోర్నీ నుంచి ఆసీస్‌ నిష్క్రమించిన తరుణంలో డేవిడ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ టీ20 ప్రపంచకప్‌ తన కెరీర్‌లో చివరిది కావొచ్చని డేవిడ్‌ గతంలోనే చెప్పాడు.

ఇప్పటి వరకు 110 అంతర్జాతీయ టీ20లు ఆడిన వార్నర్‌ ఒక శతకం, 28 అర్ధశతకాలతో 3277 పరుగులు సాధించాడు. 2019లో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో శతకం బాదాడు. మొత్తం మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన మూడో ఆసీస్‌ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. డేవిడ్‌ వార్నర్‌కు ఐపీఎల్‌ టోర్నీ మంచి పేరు తెచ్చిపెట్టింది. 2021లోనే టీ20 లీగ్స్‌లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement