Monday, December 2, 2024

AUS vs PAK | తొలి టీ20 ఆసీస్ దే !

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య గబ్బా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ దాదాపు మూడు గంటలు ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించాలని ఎంపైర్స్ నిర్ణయించారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విజిటింగ్ టీమ్ పాకిస్థాన్.. ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఓపెనర్లు మాథ్యూ షార్ట్ (7), జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (9) ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోరు వద్ద కే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ (19 బంతుల్లో*43) పరుగులతో చెలరేగిపోయాడు. ఆఖ‌ర్లో మార్కస్ స్టోయినిస్ (7 బంతుల్లో 21) విజృంభించడంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.

అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన పాక్.. ఆసీస్ దెబ్బ‌కు చేతులెత్తేసింది. బ్యాటర్ల పేలవ ప్రదర్శనతో 64 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. పాక్ బ్యాట్స్‌మెన్లలో అబ్బాస్ ఆఫ్రిది (20 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆసీస్ బౌల‌ర్ల‌లో స్పెన్సర్ జాన్సన్ ఒక్క వికెట్ తీయ‌గా… ఆడమ్ జంపా రెండు వికెట్లు ద‌క్కించుకున్నాడు. ఇక‌ జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ చెరో మూడు వికెట్లు తీసి పాకిస్థాన్ ను చిత్తు చేశారు. ఇక మూడు టీ20ల ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ 16న సిడ్నీలో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement