Friday, November 22, 2024

ICC Test Rankings | భార‌త్ ను వెన‌క్కినెట్టిన ఆసీస్..

తాజా ర్యాంకింగ్‍లను ఐసీసీ ఇవ్వాల‌ (జనవరి 5) వెల్లడించింది. పాకిస్థాన్‍తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‍లో 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరింది. కేప్‍టౌన్‍ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై విజ‌యం సాధించిన‌ భారత్.. రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‍ను భారత్ సమం చేయగా, పాకిస్థాన్‌పై ఆసీస్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ టాప్ ర్యాంక్ సాధించింది.

118 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‍ల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరింది. 117 పాయింట్లు ఉన్న భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ 115 పాయింట్లతో మూడో ప్లేస్‍లో ఉండగా.. దక్షిణాఫ్రికా (106), న్యూజిలాండ్ (95) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్ (92), శ్రీలంక (79), వెస్టిండీస్ (77), బంగ్లాదేశ్ (51), జింబాబ్వే (32), అఫ్గానిస్థాన్ (10) వరుసగా ఉన్నాయి.

మరోవైపు, వరల్డ్ టెస్టు చాంపియన్ 2023-25 సైకిల్‍లో భారత్ ప్రస్తుతం 54.16 గెలుపు శాతంతో టాప్‍లో ఉంది. ఈ సైకిల్‍లో ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడిన భారత్ రెండు గెలువగా.. ఒక ఓటమి, ఒక డ్రా ఉన్నాయి. ప్రస్తుతం ఐసీసీ వన్డేలు, టీ20ల్లో ర్యాంకింగ్‍ల్లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement