Friday, October 25, 2024

David Warner | వార్నర్‌కు ఊరాట.. నిషేదాన్ని ఏత్తేసిన ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు

ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ క్రికెటర్‌కు ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు ఊరటనిచ్చే వార్తను చెప్పింది. వార్నర్‌పై ఉన్న జీవిత కాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. 2018లో సాండ్‌ పేపర్‌ స్కాండల్‌ నేపథ్యంలో వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం పడింది.

దాంతో పాటు ఆ వివాదంలో వార్నర్‌ ఒక ఏడాది పాటు ఆటకు కూడా దూరమయ్యాడు. ఆ సమయంలో ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న సంచలన నిర్ణయంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా వార్నర్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు సీఏ తాజా నిర్ణయంతో ఆసీస్‌ దేశవాళీ లీగ్స్‌లోని జట్లకు వార్నర్‌ కెప్టెన్‌గా వ్యవహరించవచ్చు.

ఆస్ట్రేలియా ప్రముఖ టీ20 లీగ్‌ బిగ్‌బాష్‌లో ప్రస్తుతం వార్నర్‌ సిడ్నీ థండర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడిపై కెప్టెన్సీ నిషేధం ఎత్తివేయడంతో వచ్చే సీజన్‌లో వార్నర్‌ సిడ్నీ జట్టుకు సారథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ఇటీవల వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ, జాతీయ జట్టుకు తన సేవలు అవసరమనుకుంటే మళ్లి ఆసీస్‌ జట్టుకు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని డేవిడ్‌ రెండు రోజుల క్రితమే వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement