ఇండోర్ లో జరిగిన మూడో టెస్ట్ లో ఆసీస్ తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ పై ఘన విజయం సాధించింది.. 76 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు ఆదిలోనే ఓపెనర్ ఖ్వాజాను కొల్పోయినప్పటికి ట్రావెస్ హెడ్,లబూషేన్ లు భారత స్పిన్నర్లపై ఎదురుదాడి చేశారు.. డిఫెన్స్ ఆడకుండా ఎటాకింగ్ బ్యాటింగ్ లో స్పిన్నర్లకు ఈ ఇద్దరూ చుక్కలు చూపించారు.. దీంతో 19 ఓవర్లలో విజయలక్ష్యాన్ని చేరుకుంది ఆసీస్ .. ట్రావెస్ హెడ్ 49 , లబూ షేన్ 28పరుగులు చేశారు.. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 109 పరుగలు చేయగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులు చేసింది.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ భారత్ 109 పరుగులకే కుప్పకూలింది.. దీంతో విజయం కోసం 76 పరుగులు చేయాల్సిన ఆసీస్ ఎటువంటి తడబాటు లేకుండా చేజ్ చేసింది.. నాలుగు మ్యాచ్ ల గవాస్కర్, అలెన్ బోర్డర్ ట్రోపీ సిరీస్ లో ఇప్పటి వరకు భారత్ రెండు మ్యాచ్ లు గెలవగా, ఆసీస్ ఒక మ్యాచ్ లో విజయం సాధించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement