సిడ్నీ – బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత ఆటగాళ్లు వైఫల్యాల బాటవీడలేదు. వరుసగా విఫలమవుతున్న రోహిత్‌పై విశ్రాంతి పేరుతో టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేయడంతో ఏస్ పేస్ బౌలర్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఆసీసీ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
పదునైన బౌలింగ్‌తో బెంబేలెత్తిన భారత్ టాప్‌ఆర్డర్ కుప్పకూలింది. లంచ్ విరామ సమయానికి 57 రన్స్ మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
లంచ్ తర్వాత ఆచితూచి ఆడుతున్న సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని బోలాండ్ బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్ 31.3వ ఓవర్‌లో ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతిని వెంటాడిన కోహ్లీ (17) స్లిప్‌లో దొరికిపోయాడు. దీంతో 72 రన్స్ వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్25, జడేజా (4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా 4 వికెట్ల నష్టానికి 95 రన్స్ చేసింది.