Wednesday, December 18, 2024

Ausis – India – ర‌స‌కందాయంలో టెస్ట్ మ్యాచ్ – భారత్ టార్గెట్ ఎంతంటే….

బ్రిస్బేన్‌ – ఆస్ట్రేలియా. ఇండియాకు 275 ర‌న్స్ టార్గెట్ ఇచ్చింది. నిజానికి అయిదో రోజు అనూహ్య ప‌రిణామం చోటుచేసుకున్న‌ది. ఆస్ట్రేలియా ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. 7 వికెట్లు కోల్పోయి 89 ర‌న్స్ చేసిన ద‌శ‌లో రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది.

వ‌ర్షం వ‌ల్ల తొలి సెష‌న్ చాలా వ‌ర‌కు నిలిచిపోగా.. ఇక రెండ‌వ సెష‌న్‌లో ఆసీస్ బ్యాట‌ర్లు దారుణంగా త‌డ‌బ‌డ్డారు. ఒక్కొక్క‌రిగా పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. భార‌త పేస్ బౌల‌ర్లు విజృంభించ‌డంతో.. ఆసీస్ టాపార్డ‌ర్ కుప్ప కూలింది..

భారీ వ‌ర్షం పొంచి ఉన్న బ్రిస్బేన్‌లో.. భార‌త బౌల‌ర్లు ప్ర‌తాపం చాటారు. బుమ్రా మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్..ఆకాశ్ చెరో రెండు వికెట్లు త‌మ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇవాళ మ‌రో 55 ఓవ‌ర్లు మిగిలి ఉన్నాయి. దీంతో మ్యాచ్ ర‌స‌కందాయంలో ప‌డింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement