Wednesday, September 18, 2024

AUS vs NAM | ఆరు ఓవర్లలోపే నమీబియా ఫినిష్…

టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా నేడు జ‌రిగిన మ్యాచ్‌లొ ఆస్ట్రేలియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఆంటిగ్వా వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టి తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. నమీబియాను 72 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్‌… అనంతరం ఛేదనలో 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. ట్రావిస్ హెడ్ (34 నాటౌట్), డేవిడ్ వార్నర్ (20), మిచెల్ మార్ష్ (18 నాటౌట్) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు.

తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. ఆసీస్ బౌలర్ల ధాటికి 17 ఓవర్లలో 72 పరుగులుకే కుప్పకూలింది. గెర్హార్డ్ ఎరాస్మస్ (36) టాప్ స్కోరర్ గా నిలవగా.. మైఖేల్ వాన్ లింగేన్ (10) పరుగులకు వెనుదిరిగాడు. వీరిద్దరు మినహా మిగిలనెవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు వికెట్లతో చెలరేగగా.. హేజిల్‌వుడ్, స్టొయినిస్ చెరో రెండు, కమిన్స్, నాథన్ ఎలిస్ తలో వికెట్‌తో సత్తాచాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement