ఏఎస్‌బీసీ ఏసియన్ యూ-22 అండ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ 2024లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో నలుగురు భారత బాక్సర్లు ఆకాష్ గోర్ఖా, విశ్వనాథ్ సురేష్, నిఖిల్, ప్రీత్ మాలిక్ విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లారు.
సీనియర్ నేషనల్ చాంపియన్ ఆకాష్ 60కేజీల విభాగంలో తన ప్రత్యర్థి ఇయాసోవ్ సయాత్ (ఉజ్బెకిస్తాన్)పై 5-0తో గెలుపొందాడు. యూత్ వరల్డ్ చాంపియన్ విశ్వనాథ్ 48కేజీల విభాగంలో 5-2తేడాతో బరికుత్రో బ్రాయన్ (ఫిలిప్పీన్)ను మట్టికరింపించాడు. 57 కేజీల విభాగంలో నిఖిల్, 67 కేజీల విభాగంలో 5-2 తేడాతో తమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్స్‌కు చేరారు.
అయితే ఎం.జాదుమణి సింగ్ (51 కేజీలు), అజయ్ కుమార్ (63.5 కేజీలు), అంకుష్ (71 కేజీలు, ధ్రువ్ సింగ్ (80 కేజీలు), యువరాజ్ (92 కేజీలు) సెమీస్‌లో పరాజయం పాలై రజతం పతకంతో సరిపెట్టుకున్నారు. ఇక ఫైనల్స్ మంగళవారం జరుగనున్నాయి. ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఇప్పటికే 43 మెడల్స్ సాధించారు.