పట్టయ(థాయ్‌లాండ్): ఏసియన్ జూనియర్ క్వాష్ చాంపియన్‌షిప్స్ టోర్నీలో అండర్-15 కేటగిరి విభాగంలో భారత క్రీడాకారిణి అనహత్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆదివారంనాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి హాంకాంగ్ క్రీడాకారిణి క్వోంగ్ ఇనాపై 3-0తేడాతో 14ఏళ్ల అనహత్ సింగ్ ఘనవిజయం సాధించింది. టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండా అనహత్ సింగ్ ఫైనల్స్‌కు చేరింది. సెమీఫైనల్స్‌లో మలేసియన్ టాప్ సీడ్ విట్నీ ఇసాబెల్లె విల్సన్‌ను 3-0తో ఓడించిన విషయం తెలిసిందే.
దీంతో అనహత్ సింగ్ ఇప్పటి వరకు 46 నేషనల్ సర్క్యూట్ టైటిల్స్, 2 నేషనల్ చాంపియన్‌షిప్స్, 8 ఇంటర్నేషనల్ టైటిల్స్ చేజిక్కించుకుంది. యూఎస్ జూనియర్ ఓపెన్, బ్రిటిష్ జూనియర్ ఓపెన్‌లో టైటిల్స్ చేజిక్కించుకున్న ఏకైక భారతీయ మహిళా క్రీడాకారిణ అనహత్ సింగ్ ఒక్కరే. భారత్ తరఫున ఈ ఏడాది ఆఖరులో ఫ్రాన్స్‌లో జరిగే వరల్డ్ జూనియర్స్ క్వాష్ చాంపియన్‌షిప్స్‌కు అనహత్ సింగ్ ప్రాతినిథ్యం వహించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.