Monday, November 25, 2024

Asian Games – భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు గోల్డ్ మెడ‌ల్ – పైన‌ల్స్ లో 19 ప‌రుగుల‌ తేడాతో శ్రీలంక‌పై విజ‌యం

చైనాలో జ‌రుగుతున్న ఆసియా క్రీడల్లో భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు గోల్డ్ మెడ‌ల్ సాధించింది.. స్వర్ణ పతకం కోసం ఫైన‌ల్స్ లో శ్రీలంకతో తలపడిన భార‌త్ జ‌ట్టు 19 ప‌రుగులు తేడాతో విజ‌యం సాధించింది.. భార‌త్ నిర్దేశించిన 117ప‌రుగుల ల‌క్ష్యాన్ని శ్రీలంక చేధించ‌లేక‌పోయింది.. నిర్ధారిత 20 ఓవ‌ర్ల లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 97 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.. దీంతో రెండో స్థానంలో నిలిచిన శ్రీలంకకు వెండి ప‌త‌కం ల‌భించింది..

శ్రీలంక జ‌ట్టులో చామ‌రి ఆట‌ప‌ట్టు 12, అనుష్క సంజీవ‌నీ ఒక్క ప‌రుగు, వంశీ గుణ‌ర‌త్నే సున్నా ప‌రుగులకు అవుట‌య్యారు. హ‌నినీ 25, నీలాక్షి 23, ఓషిది 19 ప‌రుగులు చేశారు.. మిగిలిన వారంతా సింగిల్ డిజిల్ కు ప‌రిమిత‌మ‌య్యారు.. భారత బౌలర్లో టిటాస్ సాధు మూడు వికెట్లు సాధించగా, రాజేశ్వరీ గైక్వాడ్ కు రెండు వికెట్లు దక్కాయి.. దీప్తీ శర్మ, పూజా,దేవికాలు ఒక్కో వికెట్ పంచుకున్నారు.

అంత‌కు ముందు లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. స్మృతీ మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్‌ (42) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు తప్ప మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ భారత్‌ టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకుంది. షఫాలీ వర్మ – స్మృతీ మంధాన ఓపెనింగ్‌ చేశారు. షఫాలీ త్వరగానే ఔటైనప్పటికీ జెమీమాతో కలిసి మంధాన ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరద్దరూ రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. పరుగుల వేగం పెంచే క్రమంలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి మంధాన పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లే ఔట్ కావడంతో పరుగుల రాక కష్టంగా మారిపోయింది. ఇదే క్రమంలో దూకుడుగా ఆడేందుకు యత్నించి జెమీమా కూడా ఔటై పెవిలియన్‌కు చేరింది. షఫాలీ వర్మ 9, రిచా ఘోష్ 9, హర్మన్ ప్రీత్‌ కౌర్ 2, పూజా వస్త్రాకర్ 2 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లు ఉదేశిక ప్రబోధని, సుగందిక కుమారి, ఇనోక రణవీర రెండేసి వికెట్లు తీశారు.

ఇక కాంస్య ప‌త‌కం కోసం జ‌రిగిన మ్యాచ్ లో పాక్ పై బంగ్లాదేశ్ గెలుపొందింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement