Friday, November 22, 2024

Asian Games – షూటింగ్ లో భార‌త్ మ‌రో ప‌సిడి ప‌త‌కం… గోల్ఫ్ తో తొలి మెడ‌ల్ ..

ఆసియా గేమ్స్ 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్‌లో మరో స్వర్ణ పతకం వచ్చింది. ఎనిమిదో రోజైన ఆదివారం జరిగిన పురుషుల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో కైనాన్ చెనాయ్‌, జోరావర్‌ సింగ్‌ సంధు, పృథ్వీరాజ్‌ తొండైమాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు పసిడిని కైవసం చేసుకుంది. కువైట్, చైనాల నుంచి ఎదురైన పోటీని తట్టుకోగలిగిన భారత్ పోడియంపై అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పురుషుల ట్రాప్‌ టీమ్‌ 361 పాయింట్లు సాధించింది. కువైట్ 352, చైనా 346 పాయింట్లు సాధించాయి. ఇక స్వర్ణ పతకంతో పాటు కైనాన్ చెనాయ్‌, జోరావర్‌ సింగ్‌ సంధు వ్యక్తిగత ఫైనల్‌కు కూడా అర్హత సాధించారు.

అంతకుముందు మహిళల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో మనీషా, ప్రీతి, రాజేశ్వరి బృందం రజత పతకం సాధించింది. భారత్ షూటింగ్‌లో 7 స్వర్ణాలు, 9 రజతాలు మరియు 5 కాంస్యాలతో మొత్తంగా 21 పతకాలను సాధించింది.

మరోవైపు గోల్ఫ్‌లో భారత్‌కు మొదటి పతకం వచ్చింది. హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023 మహిళల వ్యక్తిగత విభాగంలో అదితి అశోక్ రజత పతకాన్ని గెలుచుకుంది. దాంతో ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా అదితి నిలిచింది. ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 41కి చేరింది. ఇందులో 11 స్వర్ణ పతకాలు ఉండగా.. 15 రజత, 15 కాంస్య పతకాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement